ఓజీఎఫ్ ను ప్రారంభించిన రియల్ ఎస్టేట్ అడ్వైజర్ తారక్
మాధాపూర్ లో మరో అధ్బుతమైన రిస్టారెంట్
హైదరాబాద్ లో మరో అద్భుతమైన రిస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. మాదాపుర్ నుండి కైతలాపుర్ వెళ్లే దారిలో ఓన్లీ గుడ్ ఫుడ్ పేరుతో ఓ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ తో పాటు లంచ్ బాక్స్ ఫర్ కార్పోరేట్ క్యాటరింగ్స్ ను ప్రారంభించారు ప్రముఖ రియల్ ఎస్టేట్ డ్వైజర్ తారక రంగా రెడ్డి. గురువారం ఉదయం బిగ్బాస్ స్టార్ మానస్ నాగులపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి ఓ.జీ.ఎఫ్ను ప్రారంభించారు. తాను ఏ ఆహారం తిన్నా చాలా హైజిన్గా ఉండాలన్న మానస్.. తారక్ ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారని, మంచి ఆహారాన్ని సర్వ్ చేస్తే అందరు ఎంత దూరమైనా వచ్చి తింటారని చెప్పారు. ఇక తనకు వ్యక్తిగంతగా మంచి ఆహారం తినడం ఇష్టమని చెప్పిన ఓజీఎఫ్ ఓనర్ తారక్.. వండి వడ్డించడం ఇంకా ఇష్టమని అన్నారు. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో బిజిగా ఉన్నా మనవాళ్లకు మంచి ఆహారం అందించాలన్న ఉద్ధేశ్యంతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.