దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్.. ప్రమాదానికి గురైన మాధురి కారు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (duvvada srinivas) ఎపిసోడ్ లో సినిమాకు మంచి ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యవహారంపై ఆయన భార్య వాణి (vani) గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తూవస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తన భర్త మాధురి (madhuri) అనే మహిళతో ఉంటూ, తనను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు. అంతే కాదు భర్త దువ్వాడ ఇంటి ముందు రెండు రోడులుగా కూతురుతో కలిసి ఆందోళనకు దిగారు వాణి. దీంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆసక్తికరంగా మారింది.
ఇటువంటి సమయంలో ఆదివారం మధ్యాహ్నం టెక్కలి వైసీపీ నాయకురాలు, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న కారును మాధురి కారు ఢీ కొట్టి బోల్తా పడింది. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆమెస మొబైల్ ఫోన్ లో జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు ప్రత్య్యక్ష్య సాక్షులు చెబుతున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వార్తలకు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. తాను ప్రస్తుతం డిప్రెషన్‌లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు మాధురి చెప్పుకొచ్చారు. ఓ వైపు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి.. మాధురిపై ఆరోపణలు చేస్తున్న సమయంలో ఈ కారు ప్రమాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాధురి కారు నిజంగానే ప్రమాదానికి గురైందా.. లేదంటే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా అనే కోణంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.