ఇద్ద‌ర‌మ్మాయిల ముద్దుల మొగుడు కాబోతున్న రోనాల్డినో

news02 May 25, 2018, 11:05 a.m. sports

reyonaldino
రియోడీజ‌నీరో: మామూలుగా ఎవ‌రైనా పెళ్లి చేసుకోవాల‌నుకుంటే ఏం చేస్తారు.. చ‌క్క‌ని చుక్క‌లాంటి అమ్మాయిని చూసుకొని ల‌గ్గం చేసుకుంటాం. చావైనా...బ‌తుకైనా జీవితాంతం వారితోనే బ‌తుకుతాం. ఇది మ‌న సంప్రాదాయం. కానీ, బ్రెజిల్‌లో సామాజిక ప‌రిస్థితులెలా ఉన్నాయో తెలియ‌దు కానీ, ప్ర‌ముఖ ఫుట్‌బాల్ ఆట‌గాడు రొనాల్డినో ఒక్కేసారి ఇద్ద‌రు అమ్మాయిల‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజాలను ఒక్కేసారి పెళ్లాడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి ఆయ‌న అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. 

reyodonaldo

అంతేకాదు రొనాల్డినో.. ప్రిసిల్లా కోయిల్హో, బీట్రెజ్ సౌజాలతో 6 నెల‌ల నుంచి స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్న‌డ‌టా...! బ్రెజిల్ రాజ‌ధాని రియో డీజనీరో లోని ఓ మాన్షన్ లో క‌లిసే కాపురం కూడా పెట్టారంటా..!  వీరిద్ద‌రితో రొనాల్డినో చాలా ప్రేమ‌గా ఉంటు వారు అడిగింది లేద‌న‌కుండా ఆప్యాయంగా చూసుకుంటున్నార‌టా..! ఇటీవ‌ల విదేశాల‌కు వెళ్లిన సంద‌ర్భంగా ఇద్ద‌రికీ ఒకే ర‌క‌మైన పర్ఫ్యూమ్ తెచిచ్చి ముగ్గురం ఒక్క‌టేన‌ని చెప్పాడంటా..!

reyodoldo 2

ఈఫుట్‌బాల్ రారాజు పెళ్లి ఆగ‌స్టు నెల‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు బ్రెజిల్ వార్త సంస్థ‌లు వెల్ల‌డించాయి. రియోలోని శాంటా మొనికా కండోమినియంలో పెళ్లి  జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపాయి. సో మ‌నం కూడా ఇద్ద‌రి పెళ్లాల ముద్దుల మొగుడు రొనాల్డినోను మ‌నస్ఫూర్తిగా దీవిద్దామా..? ఆయ‌న సంసార జీవితం కూడా సుఖ వంతంగా సాగాల‌ని ఆశీద్దాం. ఆల్ ది బెస్ట్ రొనాల్డినో. 

tags: ronaldino marriage, foot ball player, brazil, rio de janeiro

Related Post