క్రికెట్ కు యువ‌రాజ్ గుడ్ బై..

news02 June 11, 2019, 9:11 a.m. sports

/yuvaraj_singh_send_off_to_criket

ముంబాయి : ఇన్నేళ్లుగా నన్ను ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రికెట్ జీవితంలో.. 22 గజాల పిచ్‌పై దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన తర్వాత.. క్రికెట్‌కు వీడ్కోలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చా. జీవితంతో ఎలా పోరాడాలో.. పడి లేచి దుమ్ము దులుపుకుని ముందుకెలా సాగాలో ఈ ఆటే నాకు నేర్పింది అంటు .. ఇండియ‌న్ క్రేజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న ఆట‌కు గుడ్ బై చెప్పారు. భారత్ తరపున 400 మ్యాచ్ లు ఆడాను.. క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఇంత సాధిస్తానని ఊహించలేదు. క్రీకెట్ త‌న‌కు ఎంతో నేర్పింది.. చాలాసార్లు ఓడిపోయాను.. మ‌రెన్నో సార్లు గెలిచాను.. కాని నేనెప్పుడు కాంప్ర‌మైజ్ కాలేదు.. అంటు ఉద్వేగానికి గురైన యువ‌రాజ్.. ఐల‌వ్ క్రీకెట్.. ఐ హేట్ క్రికెట్ అంటే .. అంటే ఏది పూర్తిగ చెప్ప‌లేన‌ని అన్నారు.

yuvaraj_singh.indian creketer, gud bye, bcci,

అండర్ 19 , 2000 వరల్డ్ కప్ లో 203 రన్స్ చేయడంతో పాటు 12 వికెట్లు తీసి.. అరంగేట్రంలోనే అద‌ర‌హో అనిపించుకున్న‌యువ‌రాజ్.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కైవసం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అలా సౌరవ్ గంగూలీ, టీమిండియా ఇండియా జ‌ట్టులో ,ఓటు దక్కించుకున్నారు. అదే ఏడాది..భార‌త జ‌ట్టులోవన్డే కెరీర్ ని, 2003లో టెస్ట్ కెరీర్ ని ప్రారంభించాడు. 2017లో వెస్టిండీస్ తో తన చివరి వన్డే ఆడాడు. 2012లో తన చివరి టెస్ట్ ను ఆడాడు. యువీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 లు ఆడాడు. వన్డేల్లో 14 సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు బాదాడు. 2011 వరల్డ్ కప్‌లో భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆ వరల్డ్ కప్ లో ఆల్ రౌండ్ షో తో .. ఓకే ఓవ‌ర్ లో.. ఆరు సిక్స‌ర్ బాది.. త‌న స‌త్తా ఏంటో ప్ర‌పంచ క్రికెట్ కు చాటారు యువ‌రాజ్. యువీ బాగా ఫామ్ లో ఉన్న స‌మ‌యంలో  క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. అయినా.. కోలుకుని.. తిరిగి భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించి క్రికె్ట్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో చాటుకున్నాడు. మొత్తానికి ఇండియ‌న్ క్రికె్ట్ లో క్రీజీ, స్టైలిష్ క్రికె్టర్ గా పేరున్న యువ‌రాజ్ .. అనేక సార్లు.. వివాదాల‌ల్లో ఇరుకున్నా.. ఆట‌లో మాత్రం ఎలాంటి తేడా లేకుండా.. స‌త్తా చాటుకున్నారు యువీ. 

tags: yuvaraj singh, indian criketer, bcci, good bye creket, one day, test match, many records, all sixers, world cup winner, mumbai,

Related Post