ఆడకపోతే మనకే నష్టం

news02 Feb. 23, 2019, 7:23 a.m. sports

sachin

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్ల మృతితో పాకిస్థాన్ కు, భారత్ కు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపధ్యంలో వస్తున్న ప్రపంచకప్ మ్యాచ్ లో పాకిస్థాన్ తో ఆడకూడదని భారత్ నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హర్భజన్‌ సింగ్ తో పాటు మరి కొందరు ఆటగాళ్లు పాకిస్థాన్‌ను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఐతే అలా చేస్తే నష్టం మనకేనని సునీల్ గావస్కర్‌ అన్నారు. ఇక తాజాగా ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడకూడదన్న ఆలోచనను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెందుల్కర్‌ సైతం వ్యతిరేకిస్తున్నారు. పాకిస్థాన్ తో ఆడకుండా ఆ జట్టుకు అయాచితంగా రెండు పాయింట్లు ఇచ్చేయడం సరికాదని సచిన్ అంటున్నారు. ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత్‌ ఆడకపోతే అది పాకిస్థాన్‌కే లాభమని సచిన్‌ చెబుతున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్‌ను బహిష్కరించడం కంటే.. మ్యాచ్ ఆడి పాకిస్థాన్ ను ఓడించడం మంచిదన్న గావస్కర్‌ అభిప్రాయంతో సచిన్ టెండుల్కర్ ఏకీభవించారు. వరల్డ్ కప్ లో పాకిస్థాన్‌పై ఎప్పుడూ భారత్‌దే విజయమని చెప్పిన సచిన్.. మరోసారి పాకిస్థాన్ ను ఓడించాల్సిన సమయమిదన్నారు. వచ్చే ప్రపంచకప్‌ మ్యాచ్ లో పాకిస్థాన్ తో ఆడకుండా ఉరికే రెండు పాయింట్లు ఇచ్చేయడానికి తానైతే వ్యతిరేకమని చెప్పారు సచిన్ టెండుల్కర్.

tags: sachin, sachin tendulkar, sachin about world cup, sachin about pakistan match, achin about india pakistan match

Related Post