అనుష్క వల్లే నేనీలా ..!

news02 Feb. 17, 2018, 11:40 a.m. sports

Kohli_Comments_On_Anushka_Sharma

ఢిల్లీ : దక్షిణాఫ్రికా పర్యటనలో అద్బుతమైన ఫామ్‌తో రాణించాడు విరాట్ కోహ్లీ. అయితే  ఈ క్రెడిట్ అంతా తన భార్య అనుష్క శర్మ కే దక్కుతుందని కితాబిచ్చాడు . ఈ సిరీస్‌లో కోహ్లి మూడు సెంచరీలు .. ఒక ఆఫ్ ‌సెంచరీతో 558 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్న విషయం తెలిసిందే. చివరి వన్డే విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ..

మైదానం బయట నుంచి నాకు మద్దతుగా నిలిచినవారు కూడా నా ఫామ్‌ కు కారణమే అయినా .. ముఖ్యంగా నా భార్యకు ఈ విషయంలో అధిక క్రెడిట్‌ దక్కుతుందన్నారు ఈ పర్యటనలో తను నాకు ఎంతో మద్దతుగా నిలిచిందన్నారు . గతంలో ఆమెపై చాలా మంది విమర్శలు గుప్పించారు. నిరంతరం నాకు ప్రేరణగా నిలుస్తూ ముందుకెళ్లేలా చేస్తోంది. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌ గా విజయాలందుకోవడం గొప్ప అనుభూతి. ఇంకా నాకు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ల కెరీర్‌ ఉంది. అందుకే ప్రతీ రోజునూ ఆస్వాదించాలనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండి జట్టును నడిపిస్తుండడం నా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు . జట్టు విజయాల కోసం నా వంతు 120 శాతం కృషి చేస్తానని కోహ్లీ తెలిపాడు.

Related Post