నాకొడుకుకు వారసత్వంగా..

news02 April 3, 2018, 5:39 p.m. sports

ipl brand ambassador jr ntr

హైదరాబాద్- క్రికెట్ అనేది మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుని పోయిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎన్టీఆర్ నియమింపబడ్డాడు. హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గోన్నాడు. క్రికెట్‌ ను ఆస్తి లాగా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారన్న ఆయన... క్రీడలు ఒక లాంగ్వేజ్‌ లా కూడా పనికొస్తాయని అన్నారు. క్రీడల ద్వారానే ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోగలుగుతున్నారని ఈ సందర్బంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
 
ఇక మన దేశంలో క్రీడలపట్ల ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు జూనియర్. ప్రధానంగా క్రికెట్ మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుపోయిందని చెప్పారు. తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌ పట్ల ప్రేమను కూడా మనకు వారసత్వంగా పంచారని తాను గట్టిగా నమ్ముతానని ఎన్టీఆర్ తెలిపారు. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్‌ను చూసేవారన్న ఆయన... అలా నాన్న చూడటం దగ్గర నుంచి నేను క్రికెట్ పట్ల ఆ ప్రేమను పెంచుకోవడం జరిగిందని... నేను నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్ పట్ల ప్రేమను పెంచుతానని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.
 
కేవలం ఒక్క భారతదేశంలో ఇంతగా క్రికెట్‌ ని ఆశ్వాదిస్తారని.. అందులో భాగంగానే ఐపీఎల్ ఒక కొత్త డైమన్షన్‌ని క్రియేట్ చేసిందని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఒక కొత్త డైమన్షన్‌ కి తెలుగుభాషలో దాని కామెంట్రీ చేస్తే, స్టార్ మా మూవీస్‌లో దాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు నన్ను బ్రాండ్ అంబాసిడర్‌ గా ఎన్నుకున్నందుకు స్టార్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు జూనియర్ ఎన్టీఆర్. 

Related Post