శ్రీలంక కెప్టెన్‌పై సస్పెన్షన్ వేటు

news02 July 17, 2018, 1:20 p.m. sports

icc

దుబాయ్: కొద్ది రోజుల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో బాల్ ట్యాంప‌రింగ్ అంశం పెద్ద ర‌చ్చైన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ల‌పై ఐసీసీ ఉక్కు పాదం మోపింది విధిత‌మే. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఐసీసీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఏడాది పాటు ఇంట‌ర్ నేష‌న‌ల్ మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాయి. అయితే ఇక ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే...శ్రీ‌లంక‌ కెప్టెన్ దినేశ్ చండీమాల్‌, కోచ్ చంద్రికా హ‌తురుసింగే, మేనేజ‌ర్ అసంకా గురు సిన్హ‌ల‌పై ఐసీసీ బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డ్డార‌ని గుర్తించి నిషేదం విధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

srilanka captain

క్రికెట్ క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా వీరిద్ద‌రూ ప్ర‌వ‌ర్తించార‌ని గుర్తించి ఐసీసీ...ఈ ముగ్గురిపై ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. వీరిని సౌతాఫ్రికాతో జరిగే తొలి నాలుగు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే జూన్ 19న సెయింట్ లుసియా స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజున చండీమాల్ బంతి ప‌రిస్థితిని మార్చేందుకు ప్ర‌య‌త్నించాడు. బాల్‌కు ఏదో ప‌దార్థాన్ని రాస్తూ...కెమెరాకు చిక్కాడు. దీన్ని గ‌మ‌నించిన ఐసీసీ...వీరిపై విచార‌ణ జ‌రిపి ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తేల‌డంతో...క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది.

tags: sri lanka captain suspended by the icc,icc ball tampering,icc ball tampering rules,icc ball tampering penalties,icc ball tampering punishment,cricket ball tampering australia,cricket ball tampering england,cricket ball tampering laws,cricket ball tampering news,icc rules on ball tampering,cricket ball tampering rules,cricket ball tampering south africa,cricket ball tampering techniques, cricket ball tampering videos,chandimal sri lanka captain,cricketer chandimal,cricketer chandimal wedding,cricketer dinesh chandimal,sri lankan cricketer chandimal,d chandimal cricketer,chandimal cricket average,chandimal cricket career sri lankan cricketer dinesh chandimal,dinesh chandimal sri lankan cricketer,chandimal cricket profile,chandimal cricket player,chandimal cricket record

Related Post