News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఏకం కావాలి..:టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనసాగుతుంది : ఉత్తమ్
  • కేసీఆర్ నియంతృత్వ పాలనపై ప్రభుత్వ ఉద్యోగులు అప్రమతంగా ఉండాలి : ఉత్తమ్
  • ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంతుంది : ఉత్తమ్

హైదరాబాద్ : రాష్ట్రంలో అప్రజాస్వామిక .. దుర్మార్గమైన పాలన సాగుతుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ ప్రజలకు హక్కులు లేకుండా హరించేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో సాగుతున్న ఈ నియంతృత్వ పోకడపై అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అనాలోచితమైన .. దుర్మార్గమైన ..చట్ట విరుద్ధమైన నిర్ణయమని ఆయన విమర్శించారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని అంటున్న కేసీఆర్ .. ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మె చేయనివ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు .. ఉద్యమ సమయంలో తాను ఆర్టీసీ ఉద్యమాల గురించి ఏం మాట్లాడారో ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ తెప్పించుకుని చూడాలని ఉత్తమ్ కేసీఆర్ కు సూచించారు. ప్రతిపక్షంలో ఒక రకంగా అధికారంలోకి వచ్చాక ఒక రకంగా మాట్లాడడం కేసీఆర్ కే చెల్లిందని ఆయన విమర్శించారు.

- Advertisement -

అసెంబ్లీ లో కేసీఆర్ .. ప్రభుత్వ ఉద్యోగులను కుక్క తోకతో పోల్చడం .. రెవెన్యూ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసే విదంగా ప్రకటనలు చేయడం .. విఆర్వో వ్యవస్తను రద్దు చేస్తామని చుబుతుండటం .. చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలాంటి గౌరవ మర్యాదలు లేవనేది అర్థమౌతుందన్నారు. ప్రభుత్వ అన్ని శాఖల ఉద్యోగులు .. సంఘాలు ధైర్యంతో ప్రభుత్వం పైన ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం చేయాలని తాము ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశం ప్రతి పౌరునికి హక్కులు ఉంటాయని .. కానీ కేసీఆర్ ప్రభుత్వం పౌరుల హక్కులను కాలరాసే విదంగా ప్రవర్తిస్తుంది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ బేషజాలకు పోకుండా ఇప్పటికైనా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని ఉత్తమ్ సూచించారు. పండుగ పూట ప్రజలు పడుతున్న కష్టాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఉత్తమ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అన్ని డిపోల వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలపాలని ఆయన సూచించారు.

Leave A Reply

Your email address will not be published.