woman molested

హైదరాబాద్ లో ఘోరం- కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

హైదరాబాద్ లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి హైదరాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగింది. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది.

వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఉసమానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో సదరు ట్రావెల్స్ బస్సును ఆపి సీజ్‌ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన డ్రైవర్‌ కృష్ణ అప్పటికే పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణంతో షాక్‌కు గురైన బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఓయూ పీఎస్ సీఐ రాజేందర్‌ చెప్పారు.


Comment As:

Comment (0)