ఏపీ మద్యం కుంభకోణం-వేసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు (AP Liqour Scam)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) అరెస్టయ్యారు. ఏపీ మధ్యం కేసులో ఏ4గా మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన అనంతరం ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఉదయం ఢిల్లీ నుంచి సిట్ విచారణకు హైజరైన మిథున్ రెడ్డిని విచారించిన తరువాత పోలీసులు అరెస్ట్ చేశారు.