జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు
తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,08,561 మంది ఉండగా, 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్‌లో 2,383 మంది ఓటర్లు పెరిగారని కర్ణన్ తెలిపారు. ఇక ఉప ఎన్నిక నేపధ్యంలో తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం పట్టుబడింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్ లో.. నాలుగు బ్యాలెట్ యూనిట్స్, ఒక వీవీ ప్యాట్ వినియోగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వీ కర్ణన్ తెలిపారు.