పేద ప్రజల కోసం రాహూల్ తన జీవితాన్ని అంకితం చేశారు- సీఎం రేవంత్
హైదరాబాద్ రిపోర్ట్- పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిపించి తద్వార ఇండియా కూటమి నీ గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన లోక్ సభ ఎననికల ప్రచార సభ జనజాతరలో ఏఐసీసీ అగ్రనేత రాహూల్ గాందీతో కలిసి పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ లోక్ సభ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్ల పై మోడీ కండ్లు పడ్డాయని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడడంతో పాటు రిజర్వేషన్లు అమలు కావాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. ఆంధ్రలో అధికారం కోల్పోయినా.. దేశంలో అధికారం కోల్పోయినా.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు.
ఇక విశ్వ నగరం హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు విషం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ సభ్యురాలు మాట్లాడుతూ 15 సెకన్లు సమయం ఇస్తే మైనార్టీ లను తుద ముట్టిస్తామని వార్నింగ్ ఇచ్చిందని.. అంతా ఒకసారి ఆలోచించాలని చెప్పారు. జనాలను రెచ్చే గొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ మహిళ నేత మీద కేస్ లు పెట్టి, ఆమెను అరెస్ట్ చేయాలన్నారు. మనం అన్ని పండుగలు చేస్తున్నామన్న రేవంత్.. హిందూత్వం గురించి బీజేపీ వాళ్ళు నేర్పాలా అని ప్రశ్నించారు.