Newspillar
Newspillar
Saturday, 20 Jul 2024 18:30 pm
Newspillar

Newspillar

దుబాయ్ ప్రధాని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూమార్తె విడాకులు తీసుకుంది. అంది కూడా బిడ్డ పుట్టిన రెండు నెలల్లోనే. అవును ఇప్పుడు ఈ వీడాకుల అంశం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ ను 2023 మే 27న వివాహం చేసుకుంది యువరాణి షైకా (dubai princess sheikha). గత మే నెలలోనే షైకా, మనా దంపతులకు మొదటి సంతానం కలిగింది. మరి ఏమైందో తెలియదుగాని ఇంతలోనే మనాకు విడాకులు ఇవ్వాలని యువరాణి షైకా నిర్ణయించుకుంది. 

నిర్ణయం తీసుకున్నదే తడవుగా సోషల్ మీడియా వేధిక ద్వారా విడాకుల ప్రకటన చేసింది యువరాణి షైకా. తన ఇన్ స్టాగ్రామ్ లో.. ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు.. అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను.. ఇట్లు మీ మాజీ భార్య షైకా.. అంటూ విడాకుల ప్రకటన చేసింది యువరాణి. వీరిద్దరి డైవోర్స్ అంశానికి సంబందించి అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రత్యేక కధనాలను వెలువరించింది. యువరాణి షైకా లండన్ లోని ప్రముఖ విద్యాసంస్థల్లో అంతర్జాతీయ సంబంధాలపై ప్రత్యేక డిగ్రీ చదువుకుంది.