Newspillar
Newspillar
Tuesday, 13 Aug 2024 18:30 pm
Newspillar

Newspillar

పారిస్ ఒలింపిక్స్ (paris olympics 2024) లో భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ఫోగట్ (vinesh phogat) కు నిరాశే ఎదురైంది. రజత పతకం కోసం చేసిన ఆమె అప్పీల్ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాలని సీఏఎస్ నిర్ణయించింది. రజత పతకం వస్తుందని ఆశించిన వినేశ్ ఫోగట్తో పాటు.. భారత్ కు నిరాశ ఎదురైంది. వినేశ్ ఫోగట్ నిర్ణయంపై మూడుసార్లు తీర్పు వాయిదా పడగా, ఆగష్టు 16 తీర్పు ఇస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్పష్టం చేసింది. దీంతో వినేశ్ ఇంకా పారిస్ లోనే ఉండిపోయింది.

సీఏఎస్ తీర్పు వచ్చిన తరువాతే అక్కడి నుండి ఇండియాకు వస్తానని చెప్పింది. ఇటువంటి సమయంలో  కోర్టు నిర్ణయంతో వినేశ్ ఫోగట్ కు భారీ షాక్ తగిలింది. పారిస్ ఒలింపిక్స్‌ 2024 రెజ్లింగ్ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అదనపు బరువు ఉందన్న కారణంగా వినేశ్ఫొగాట్పై అనర్హత వేటు పడింది. దీనిపై కోర్టు ఆఫ్ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కు వినేశ్అప్పీల్ కు వెళ్లింది. తనకు కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో వినేష్ఫోగట్ కు పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు మద్దతు తెలిపారు.