Newspillar
Newspillar
Tuesday, 13 Aug 2024 18:30 pm
Newspillar

Newspillar

ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి అన్న క్యాంటీన్లు (anna canteen) ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu) చేతుల మీదుగా మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న శుక్రవారం మిగతా  99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్ల పధకానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (nara bhuvaneshwari) భారీ విరాళం ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు తరుఫున అన్న క్యాంటీన్లకు కోటి రూపాయల విరాళంగా అందించారు నారా భువనేశ్వరి.
  

ఈ మేరకు కోటి రూపాయల చెక్కును ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు నారా భువనేశ్వరి. నిరుపేదలు, కార్మికుల, కూలీల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లు ఎంతో గొప్ప కార్యక్రమమని ఈ సందర్బంగా నారా భువనేశ్వరి కొనియాడారు. కోటి రూపాయల విరాళం అందించిన తరువాత ట్వీట్ చేసిన భువనేశ్వరి.. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి అనే పదం వినపడకూడదనే మహోన్నత లక్ష్యంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున కోటి రూపాయలు ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు.