Newspillar
Newspillar
Wednesday, 11 Sep 2024 00:00 am
Newspillar

Newspillar

బాలీవుడ్‌ సీనియర్ నటి మలైకా అరోరా (Malaika Arora) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మలైకా అరోరా తండ్రి అనిల్‌ అరోరా (Anil Arora) బలవన్మరణానికి పాల్పడ్డారు. ముంబయి (Mumbai) లోని తన ఇంటి టెర్రస్‌ పై నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పని నిమిత్తం పుణెలో ఉన్న మలైకా అరోరా తన తండ్రి మరణవార్త గురించి సమాచారం అందగానే హుటాహుటిన ముంబయి బయల్దేరింది. మలైకా మాజీ భర్త, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ సైతం అనిల్‌ అరోరా నివాసానికి చేరుకున్నారు. అనిల్ అరోరా అత్మహత్య గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. 

మలైకా అరోరా 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి మలైకా, ఆమె సోదరి అమృత తల్లి వద్దే పెరిగారు. ఆమె తండ్రి అనిల్‌ అరోరా అప్పటి నుంచి మంబయిలోని బాంద్రాలో ఒంటరిగానే నివాసముంటున్నారు. పంజాబ్‌కు చెందిన అనిల్‌ అరోరా మర్చెంట్ నేవీలో పనిచేశారు. ఐతే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత సంవత్సరం ఆయన ఆసుపత్రిలో చేరగా, తండ్రిని చూసేందుకు మలైకా తల్లితో కలిసివెళ్లింది.