Newspillar
Newspillar
Thursday, 23 Oct 2025 18:30 pm
Newspillar

Newspillar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)తో తెలంగాణకు చెందిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ భేటీ అవ్వడం సర్వత్రా ఆసక్తిరేపుతోంది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రంగనాథ్‌, పవన్‌ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా వీరిద్దరూ పలు అంశాలపై చర్చించనట్లు తెలుస్తోంది. ఐతే హైడ్రా కమీషనర్ రంగనాధ్ తో మర్యాద పూర్వకంగా భేటీ జరిగినట్లు పవన్‌ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్, రంగనాధ్ భేటీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.