
నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) తన తాజా సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) ప్రమోషన్లలో భాగంగా విద్యార్థులతో ప్రత్యేకంగా ఛాట్ చేసింది. ఈ సందర్బంగా తన సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలో డేటింగ్, రూమర్స్, పుష్ప 3 పై సరదాగా స్పందించింది. జర్నలిజం చదువుకున్న తాను, తనపై వచ్చే వార్తలను చూసి ఆశ్చర్యపోతానని రష్మిక చెప్పుకొచ్చింది. విధ్యార్ధులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తనదైన శైలిలో ఫన్నీ సమాధానాలు చెప్పింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో.. మీ గురించి చక్కర్లు కొడుతున్న ఒక నిజమైన రూమర్ ఏంటి? అని ఓ అభిమాని అడగ్గా.. నేను ఏం చెప్పగలను? అది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను'' అంటూ రష్మిక నవ్వేసింది. ఇక నాకు ఇప్పుడు 18 ఏళ్లు, డేటింగ్ చేయడానికి మీరేమైనా మంచి సలహా ఇస్తారా? అని ఓ స్టూడెంట్ అడగ్గా.. సిగ్గు లేదా నీకు, పద్దెనిమిది సంవత్సరాలకే డేటింగ్ కావాలా నీకు?'' అని రష్మిక ఎదురు ప్రశ్నించింది. మరో స్టూడెంట్.. పుష్ప 3 (Pushpa3) ఎప్పుడు ఉంటుంది? అని ప్రశ్నించగా.. సినిమాలో ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత అంటూ సమాధానం దాటవేసింది రష్మిక.
ప్రస్తుతం రష్మికకు సంబందించిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతోంది. రష్మిక మందన ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఓవైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు అప్పుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది రష్మిక.