Newspillar
Newspillar
Wednesday, 12 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

బాలీవుడ్ రిపోర్ట్- బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (Shahruk Khan) సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan)ని ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నయన్‌ తో జాగ్రత్తగా ఉండు అంటూ విఘ్నేశ్ శివన్ ను హెచ్చరించారు షారుక్. కొట్టడంలో నయనతార కొత్త టెక్నిక్స్‌ నేర్చుకున్నారంటూ విఘ్నేశ్‌ కు సూచిస్తూ ట్వీట్ చేశారు షారుక్. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక అసలు విషయానికి వస్తే షారుఖ్‌ ఖాన్ నటించిన జవాన్‌ (Jawan) సినిమా ట్రైలర్‌ పై విఘ్నేశ్‌ శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ట్రైలర్ తనకెంతో నచ్చిందని ఆయన పోస్ట్‌ చెశారు. ఇలాంటి బిగ్గెస్ట్ చిత్రంతో అట్లీ బాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉందని, ట్రైలర్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉందని మెచ్చుకున్నారు. అంతే కాదు షారుఖ్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనే నా సతీమణి నయన్‌ కల నెరవేరిందంటూ.. జవాన్ మూవీ టీమ్‌ మొత్తానికి అభినందంనలు తెలిపారు విఘ్నేశ్ శివన్.

విఘ్నేశ్‌ శివన్ ట్విట్టర్ పోస్ట్ పై స్పందించిన షారుక్ ఖాన్.. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.. నయన్‌ అద్భుతమైన వ్యక్తి.. మీకు ఇప్పటికే ఈ విషయం తెలుసు కదా.. ఇటీవల ఆమె (నయనతార) కొన్ని కీలకమైన పంచ్‌ లు నేర్చుకున్నారు. కాబట్టి జాగ్రత్త.. అని సరదాగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. అన్నట్లు పఠాన్‌ (Pathaan) తర్వాత షారుక్ ఖాన్ నటిస్తోన్న సినిమా జవాన్‌. ఈ మూవీకి అట్లీ డైరెక్టర్. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, దీపికా పదుకొణె, విజయ్‌ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 10న జవాన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.