Newspillar
Newspillar
Wednesday, 12 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

సినిమా- మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 - డెడ్‌ రెకొనింగ్‌ (పార్ట్‌-1)

Mission Impossible 7 Movie Review 
తారాగణం- టామ్ క్రూజ్, హైలీ యాట్‌వెల్, వింగ్ రైమ్జ్, సైమన్ పెగ్, రెబెక్కా, హెన్రీ చెర్నీ, వనేసా కొర్బీ,
మ్యూజిక్- లోర్న్ బెల్ఫ్
సినిమాటోగ్రఫీ-  ఫ్రెజర్ టాగ్గర్ట్ 
ఎడిటింగ్‌- ఎడ్డీ హామిల్టన్‌ 
నిర్మాతలు- టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్ క్వారీ 
దర్శకత్వం- క్రిస్టోఫర్ మెక్ క్వారీ

పరిచయం- మిషన్‌ ఇంపాజిబుల్‌ (Mission Impossible) సిరీస్‌ యాక్షన్ ప్రియులను ఎంతగా అలరిస్తూ వస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు ఏమాత్రం తీసిన పోనివిధంగా ఈ మూవీ సిరీస్ కథలు అలరిస్తున్నాయి. ఇక మిషన్ ఇంపాజిబుల్ సినిమాను టామ్‌ క్రూజ్‌ (Tom Cruise) లేకుండా ఏ మాత్రం ఊహించుకోలేము. ఇప్పటివరకూ ఈ సిరీస్‌ లో మొత్తం ఆరు సినిమాలు రాగా, ఆఖరి మూవీని రెండు పార్ట్స్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించించింది యూనిట్. ఇందులో మొదటి భాగమే మిషన్ ఇంపాజిబుల్ డెడ్‌ రెకొనింగ్‌- పార్ట్‌1 తాజాగా  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 

మిషన్ ఇంపాజిబుల్ కధ ఏటంటే- శత్రు దేశాల రాడార్‌ లకు కూడా దొరక్కుండా సముద్ర గర్భంలో తిరిగగలిగే సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ది ఎంటిటీ సోర్స్ కోడ్ ఉంటుంది. రెండు కీ’లను కలిపి ఒకటిగా చేసి మాత్రమే దాన్ని అన్‌లాక్‌ చేసి, నియంత్రించగలిగే టెక్నాలటీ ఉంటుంది. ఐతే అనుకోని పరిస్థితుల్లో ఆ సబ్‌మెరైన్‌ పేలిపోయి సముద్రంలో మునిగిపోతుంది. అందులో ఉన్న వారందరూ చనిపోతారు. ఈ క్రమంలో ఆ సబ్ మెరైన్ కు సంబందించిన రెండు కీ లు సముద్రంలో నుంచి మాయం అవుతాయి. వాటిని దక్కించుకుని ది ఎంటిటీ ని నియంత్రించగలిగితే  ప్రపంచాన్ని శాసించే శక్తిని సొంతం చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని ఎవరైనా సులభంగా హ్యాక్‌ చేసి, ఆ తాళాలను చేజిక్కించుకుని, ఈ ప్రపంచాన్ని శాసించాలని కొందరు ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో కీస్ ను దుర్మార్గుల చేతిలో పడకుండా కాపాడే బాధ్యత మిషన్‌ ఇంపాజిబుల్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ ఈథన్‌ హంట్‌ కు అప్పజెప్పుతారు. మరి ఆ తాళాల కోసం ఈథన్‌ హంట్‌ ఎలాంటి సాహసం చేశాడు, ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదురయ్యాయి, శత్రువులతో ఎంతటి ప్రమాదం నెలకొంది అన్నది తెలియాలంటే మాత్రం మిషన్ ఇంపాజిబుల్ మూవీని ధియోటర్ లోనే చూడాలి.

మరి సినిమా ఎలా ఉంది- మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్లు, ఒళ్లు గగుర్పొడిచే ఛేజింగ్‌లు, మాస్క్‌ లతో ముఖాలను మార్చి శత్రువులను బురిడీ కొట్టించడం.. ఇలాంటి థ్రిల్లింగ్‌ సీన్స్‌ కొత్తేమి కాకపోయినా ఈ సిరీస్ లో మరింత ధ్రిల్ అనిపిస్తుంది. గత ఆరు సిరీస్ లకు ఏ మాత్రం తీసి పోని విధంగా ఈ మిషన్‌ ఇంపాజిబుల్‌ -7 ను తీశాజు డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ట్విస్ట్‌లు లేవని అనిపిస్తుంది. ఐతే యాక్షన్‌ సీన్స్‌ వచ్చినప్పుడు మాత్రం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. మిషన్ ఇంపాజిబుల్ -7 పార్ట్‌-2 ఉందన్న ఉద్దేశంతో ఇందులో ఎక్కువ ట్విస్ట్‌లు ఇవ్వలేదని అనుకోవచ్చేమో. ఇక్కడ ఇంట్రెట్టింగ్ విషయం ఏంటంటే, ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ()ది కీలకపాత్ర. చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. ఐతే అదే ఏఐ మానవులకు సమస్యగా పరిణమిస్తే, ప్రతి ఒక్కరి భవిష్యత్‌ ను నిర్ణయించేది, శాసించేది కూడా ఏఐ అయితే, ఊహించడం కాస్త భయంకరంగానే ఉంటుంది. అలాంటి టెక్నాలజీని చెడ్డ వ్యక్తులు నియంత్రిస్తే ఆ పరిణామాలు మరింత భయానకరంగా ఉంటాయి. మిషన్ ఇంపాజిబుల్ లో ది ఎంటిటీ వల్ల సబ్‌మెరైన్‌ ఎలా మునిగిపోయిందో చెబుతూ, దాని శక్తిని చూపించాడు డైరెక్టర్. 

ది ఎంటిటీని నియంత్రించే కీ అన్వేషణ కోసం ఈథన్‌ హంట్‌ రంగంలోకి దిగడంతో కథలో వేగం పెరుగుతుంది. ఇక ఫేస్‌ రికగ్ననేషన్‌ లాంటి అత్యున్నత టెక్నాలజీని కూడా ఎలా బురిడీ కొట్టించవచ్చో కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్. ఆ తర్వాత  కీ తో పాటు కథ కూడా రోమ్‌కు చేరుకుంటుంది. అక్కడ సాగే ఛేజింగ్‌ సీన్స్‌ సినిమాకే హైలైట్‌ అని చెప్పవచ్చు. క్లైమాక్స్‌ లో వచ్చే ట్రైన్‌ ఫైట్‌ తీర్చిదిద్దిన తీరు అద్భుతం అని చెప్పకతప్పదు. ది ఎంటిటీ ఎక్కడుందో ఈథన్‌ హంట్‌ తెలుసుకునే సీన్‌ భావోద్వేగ భరితంగా సాగుతుంది. సుమారు అరగంట పాటు సాగే క్లైమాక్స్‌ లో టామ్‌ క్రూజ్‌ చేసిన బైక్‌ స్టంట్‌ అద్భుతం. గతంలో మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్ లు చూడని వారికి కూడా ఈ సినిమా ఈజీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమాను ఫస్ట్‌ సీన్‌ నుంచి చూస్తే తప్ప అసలు ది ఎంటిటీ అంటే ఏంటో అర్ధమవుతుంది. మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 తెలుగు బాషలోను కొన్ని థియేటర్స్‌లో ఆడుతోంది. మరింకేందుకు ఆలస్యం..

ఇక ఈ సినిమాలో అందరు అద్భుతంగా నటించారు. ప్రత్యేకంగా ఈథన్‌ హంట్‌ పాత్రలో టామ్‌ క్రూజ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. 1996 నుంచి ఈ సిరీస్‌ కోసం ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన సాహసాలు సినీ చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ఈ సిరీస్ కోసం 61 ఏళ్ల వయసులోనూ టామ్‌ క్రూజ్‌ చేసిన బైక్‌ స్టంట్‌చూస్తే మొదటి మిషన్‌ ఇంపాజిబుల్‌ లో ఏ ఎనర్జీతో అయితే నటించారో అలాగే ఇందులోనూ చేశారు. ఇక గ్రేస్ పాత్రలో హైలే ఎట్‌ వెల్ చక్కగా యాక్ట్ చేసింది. అటు సైమన్ పెగ్, వింగ్‌ రెహమ్స్‌లు వారి వారి పరిధి మేరకు నటించారు. ఇక మిషన్ ఇంపాజిబుల్ -7 సినిమారు  టామ్‌ క్రూజ్‌ నటన అద్భుతం కాగా, యాక్షన్‌ సీన్స్‌, సినిమాటోగ్రఫీ, సంగీతం, డైరెక్షన్ ప్లస్ అయ్యాయి.

నోట్- ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.