Newspillar
Newspillar
Saturday, 15 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. గతంలో తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ పోటీ చేసిన స్థానం నుంచే ఆయన ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ పార్లమెంట్ స్థానం నుంచి అభిషేక్‌ బచ్చన్ పోటీ చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

1984లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ కోరిక మేరకు అమితాబ్ బచ్చన్ ప్రయాగ్‌ రాజ్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి, భారీ మెజార్టీతో గెలుపొందారు. లోక్‌దళ్‌ అభ్యర్థి హెచ్‌.ఎన్‌.బహుగుణపై లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు అమితాబ్. అభిషేక్‌ తల్లి జయా బచ్చన్‌ సైతం ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ బచ్చన్ కూడా ప్రయాగ్‌ రాజ్‌ నుంచి పార్ల మెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని సమాజా వాదీ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.