Newspillar
Newspillar
Saturday, 22 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ (Konaseema) జిల్లాలో ఉన్న వాడపల్లి వెంకన్న (Vadapalli VEnkanna) సన్నిధికి ఏడు వారాలు విధిగా వస్తే కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. చాలా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వెంకన్నను దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే బెంగళూరు (Bangalore) కు చెందిన ఓ భక్తుడు అదే నమ్మకంతో ఏకంగా  తన సొంత విమానంలో ప్రతి వారం వచ్చి వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటున్నారు. 

ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. తన సొంత విమానంలో రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి కారులో వాడపల్లి వస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ బెంగళూరు భక్తుడు గత ఆరు వారాలుగా ప్రతి వారం వాడపల్లికి వస్తున్నాడట. వాడపల్లి వెంకన్న ఆలయాని కోటి రూపాయల విరాళం కూడా అందించాడని ఆలయ అధికారులు చెప్పారు.