Newspillar
Newspillar
Friday, 28 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పోర్ట్స్ రిపోర్ట్- ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో అత్యంత చెత్త ప్రదర్శనతో ఆఖరి స్థానాల్లో నిలిచిన జట్టు అందరూ చెప్పే ఆన్సర్.. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ (SRH). ఆ జట్టు యజమాని కావ్యా మారన్‌ (Kavya Maran) అని అందరికి తెలుసు కదా. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌ లు ఎక్కడ జరిగినా కావ్యా మారన్‌ వచ్చి సందడి చేస్తుంది. అలాంటి కావ్యా తన జట్టు వరుసగా ఓడిపోతుండటంతో చాలా నిరాశచెందుతోంది. మొన్నా మధ్య నిరాశలో ఉన్న ఆమె హావభావాలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను క్రికెట్ అభిమానులను సైతం ఆవేధనకు గురిచేశాయి.

కావ్యా మారన్‌ అలా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారు. సూపర్ స్టార్‌ రజనీ కాంత్‌ (Rajinikanth) సైతం కావ్యా మారన్‌ ను ఆలా చూడటం చాలా బాధేసిందని చెప్పారు. చెన్నైలో శుక్రవారం రాత్రి జైలర్ (Jailer) సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగ్గా.. అక్కడ రజనీకాంత్ కావ్యా మారన్ గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. రజనీ కాంత్ ఏమన్నారంటే.. కావ్యా మారన్‌ ను ఐపీఎల్‌ మ్యాచ్ సందర్భంగా టీవీల్లో అలా చూసేసరికి నాకు చాలా బాధేసింది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ వరుసగా ఓడిపోవడంతో ఆమె తీవ్ర నిరుత్సాహానికి గురైంది. అందుకే, వచ్చే సంవత్సరం మంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకుని బరిలోకి దిగాలని కావ్యా మారన్ తండ్రి, నిర్మాత కళానిధి మారన్‌కు సూచించారు రజనీకాంత్.

జైలర్‌ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్ డైరెక్టర్ కాగా, మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia) హీరోయిన్. కళానిధి మారన్ నిర్మాత. అన్నట్లు జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. Sun Risers hyderabad