
మూవీ రిపోర్ట్- సైమా అవార్డ్ట్ 2023 (SIIMA 2023) వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023 వేడుకల్ని దుబాయ్ (Dubai) లోని డి.డబ్ల్యూ.టి.సి లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్ (RRR) ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత 10 కేటగిరిల్లో సీతారామం (Seetharamam) కి నామినేషన్స్ (SIIMA 2023 Nominations) దక్కాయి. ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధూరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ మూవీ కార్తికేయ2, అడవి శేష్ మేజర్ లతో పాటు సీతారామం సినిమాలు పోటీ పడుతున్నాయి.
అటు తమిళంలో 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్ 1 (Ponniyin Selvan:1) సినిమాకు దక్కాయి. మణిరత్నం దడైరెక్షన్ లో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక కమల్‌హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ (Vikram) సినిమా 9 నామినేషన్స్ ను దక్కించుకుంది. మరోవైపు కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన రిషబ్‌శెట్టి కాంతార (Kantara), యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీయఫ్2’(KGF Chapter 2) సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయళంలో సైమా కోసం ఈసారి ఆరు సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి.