Newspillar
Newspillar
Friday, 04 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- పాకిస్థాన్‌ (Pakistan) క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ (Shoaib Malik), భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza) విడాకులపై మరోసారి చర్చ జరుగుతోంది. సుమారు సంవత్సర కాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరి డైవోర్స్ (Divorce) పై వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. షోయబ్ మాలిక్, సానియా మీర్జాలకు 2010లో వివాహమైంది. వీరిద్దరికి కుమారుడు ఇజ్‌హాన్‌ మాలిక్‌ ఉన్నాడు.

శుక్రవారం షోయబ్‌ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి సానియా మీర్జా వివరాల్ని తొలగించడంతో వీరి విడాకుల ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇంతకు ముందు షోయబ్ బయోలో సూపర్‌ వుమన్‌ సానియా మీర్జా భర్త అని ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించేశాడు. సానియా మీర్జా సైతం తన ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి షోయబ్‌ ఫొటోలలను తీసేసింది. దీంతో వీళ్లిద్దరు విడిపోతున్నారనే వార్త మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.