Newspillar
Newspillar
Monday, 07 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- విశాఖపట్నం (Vishakapatnam) హనీ ట్రాప్ (Pak Honey Trap) కలకలం రేపుతోంది.  పాకిస్తాన్ హనీట్రాప్‌ లో విశాఖ స్టీలు ప్లాంట్‌ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ కపిల్‌ కుమార్‌ జగదీష్‌ భాయ్‌ మురారీ (Kapil Kumar Jagadish Bhai Murari) చిక్కాడు. గుజరాత్‌ కు చెందిన కపిల్‌ కుమార్‌ అంతకు ముందు హైదరాబాద్ లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2022 ఆగస్టు 22న బదిలీపై వచ్చి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెక్యూరిటీ విభాగంలో చేరాడు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కపిల్‌కు రెండేళ్ల క్రితం తమీషా (Tanisha honey trap) పేరుతో ఫేస్‌ బుక్‌ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తరువాత న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేసుకున్నారు. 

అంతే కాదు ఆ తరువాత హైదరాబాద్‌ లోని భానూర్‌ లో ఓ గదిలో రహస్యంగా కలిసేంత వరకు వీరి వ్యవహారం వెళ్లింది. సదరు మహిళ పాకిస్తాన్ కు చెందిన ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకడుడి వద్ద పర్సనల్ సెక్రెటరిగీ పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. గత రెండేళ్లుగా కపిల్‌ నుంచి భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, స్టీల్‌ ప్లాంట్‌ రహస్య సమాచారాలు బయటకు వెళ్లినట్లు సమాచారం. ఒక మొబైల్‌ ఫోన్ తో పాకిస్థాన్ కు డెందిన వారితో సంప్రదింపులు సాగిస్తున్నారన్న నిఘా సంస్థల సమాచారంతో పోలీసులు కపిల్‌ కుమార్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. 

ఆయన ఫోన్ లో తమీషా పేరుతో నంబరు సేవ్‌ చేసినట్లు ఉంది. ఈ నెల 1న కపిల్‌ వద్ద రెండు సెల్‌ ఫోన్లు మాత్రమే గుర్తించగా, 4వ తేదీన మరో ఫోన్‌ కనిపించింది. ఐతే ఈ మూడు సెల్‌ ఫోన్లల్లో సోషల్ మీడియా యాప్‌ లలో మెసేజులు డిలీట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కపిల్‌ కుమార్‌ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. vishaka honey trap case