
స్పెషల్ రిపోర్ట్- ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈటీవి ((ETV)) విభిన్నమైన కార్యక్రమాలతో వినోదం పంచుతూ ప్రేక్షకులకు అభిమాన ఛానెల్ గా మారింది. ఈ నేపధ్యంలో ఈటీవీ 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ బలగం (ETV Balagam) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సహా చాలా మంది ఆర్టిస్టులు ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రోమోను తాజాగా విడుదల చేయగా బైగై వైరల్ అవుతోంది.
ఈటీవీ బలగం ప్రోమోలో ముఖ్యంగా జబర్ధస్త్ (Jabardasth) యాంకర్ రష్మి (Rashmi), సుధీర్ (Sudheer) లు సందడి చేశారు. ప్రేక్షకుల్లో ఈ జంటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా కాలం చరువాత సుధీర్, రష్మి కలిసి సందడి చేయడంతో ఈటీవీ బలగం మరింత ఆసక్తిరేపుతోంది. మరి రష్మి, సుధీర్ జోడి ఏమేరకు సందడి చేసిందో ఈటీవీ బలగంలో చూడాల్సిందే.