Newspillar
Newspillar
Tuesday, 08 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పోర్ట్స్ రిపోర్ట్- భారత్‌ వేదికగా ఈ సంవత్సరం అక్టోబరు, నవంబరు మధ్య ఐసీసీ వన్డే ప్రపంచప్‌ (World Cup 2023) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ లకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆగస్టు 25 నుంచి మొదలవుతుందని ఐసీసీ (ICC), బీసీసీఐ (BCCI) ప్రకటించాయి. ఐసీసీ వన్డే ప్రపంచప్‌ మ్యాచ్ టికెట్లు కావాలనుకునేవారు ఆగస్టు 15 నుంచి https://www.cricketworldcup.com/register  వెబ్ సైట్ లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే అందరికంటే ముందే టికెట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని నిర్వాహకులు చెప్పారు. ఈ సారి E-Ticket ఆప్షన్‌ లేదని, అభిమానులు బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి నేరుగా టికెట్లను కొనుక్కోవాల్సి ఉంటుందని తెలిపారు. 

ఐసీసీ వన్డే ప్రపంచప్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల తేదీల వివరాలు

నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు- ఆగస్టు 25.
గుహవాటి, తిరువనంతపురంలో భారత్ మ్యాచ్‌- ఆగస్టు 30. 
చెన్నై, దిల్లీ, పుణెలో భారత్ మ్యాచ్‌లు- ఆగస్టు 31.
ధర్మశాల, లఖ్‌నవూ, ముంబయిలో భారత్ మ్యాచ్‌లు- సెప్టెంబర్ 1
బెంగళూరు, కోల్‌కతాలో భారత్ మ్యాచ్‌లు- సెప్టెంబర్ 2
అహ్మదాబాద్‌లో భారత్ మ్యాచ్‌లు- సెప్టెంబర్ 3
సెమీ ఫైనల్స్, ఫైనల్- సెప్టెంబర్ 15

క్రికెట్ అభిమానులు పై షెడ్యూల్ ప్రకారం టిక్కెట్స్ కొనుక్కోనేలా ప్లాన్ చేసుకొండి మరి.