Newspillar
Newspillar
Friday, 11 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

గుంటూరు క్రైం రిపోర్ట్- గుంటూరు (Guntur) జిల్లాలో దారణఘటన చోటుచేసేకుంది. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన సంఘటన పొన్నూరు (Ponnur) లో కలకలం రేపుతోంది. ఆరేళ్ల బాలుడు స్థానికంగా ప్రైవేట్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రోజు స్కల్ నుంచి వచ్చాక ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో.. నాగిశెట్టి పవన్‌ సంజయ్‌ (20) (Nagishetty Pawan Sanjay) అనే వ్యక్తి గంజాయి మత్తులో బాలుడిని రూమ్ లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు గమనించి అక్కడికివచ్చి అతడికి దేహశుద్ధి చేశారు. కుటుంబ సభ్యులు, స్ఠానికులు అర్బన్‌ పోలీసులకు సమాచారమివ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.