Newspillar
Newspillar
Friday, 11 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

బాపట్ల క్రైం రిపోర్ట్- రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే దారుణానికి ఒడిగట్టిన ఘటన బాపట్ల (Bapatla) జిల్లాలో చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు ఇంటికి పిలిపించి, మత్తుమందు ఇచ్చి ఎస్సై తనపై అత్యాచారం చేసినట్లు ఓ యువతి ఆరోపించింది. ఈమేరకు అద్దంకి (Addanki) పోలీస్‌ స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్‌బాబు చెప్పారు. గతంలో అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్‌ వలీ (Samandar Vali) తాను విధులు నిర్వర్తించే సమయంలో తనను పుట్టిన రోజు పేరుతో ఇంటికి పిలిచి, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. ఆ సమయంలో అశ్లీల చిత్రాలు చిత్రీకరించాడని, తనను పెళ్లి చేసుకోమని కోరగా చంపుతానని బెదిరించినట్లు చెప్పింది. యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.