
హైదరాబాద్ రిపోర్ట్- దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఆవేధన వ్యక్తం చేశారు. దేశంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని, కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం (Secular Writers Fourm ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్, ఆ తరువాత దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి, కానీ దేశానికి తగిలిన గాయాలు రాచపుండు అవుతాయని ఈ సందర్బంగా ప్రకాశ్ రాజ్ అన్నారు.
కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరన్న ప్రకాశ్ రాజ్.. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారని చెప్పారు. ప్రస్తుత సమాజం సందిగ్ధంలో ఉందని.. వంద రోజులుగా మణిపుర్ మండిపోతుందని అన్నారు. మణిపుర్ గురించి ప్రశ్నిస్తే హరియాణ, బెంగాల్.. అని అనవసర విషయాలు ప్రస్తావించారని పరోక్షంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ప్రకాశ్ రాజు.