Newspillar
Newspillar
Sunday, 13 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

అనంతపురం రూరల్ రిపోర్ట్-  పంట పండించాలంటే సాగునీరు అవసరం. ఇప్పటీకి చాలా ప్రాంతాల్లో వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్లు లక్షల మంది ఉన్నారు. ఇదిగో సాగు నీటి కోసం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (Anantapur) రైతులు పడుతున్న కష్టాలకు చూస్తే నిజంగానే ఆవేధన కలుగుతోంది. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు దొరకడం చాలా అరుదైపోయింది. ఎక్కడైనా ఒక్క బోరులో (Borewell) కొంచెం నీళ్లు పడినా ఆ చుట్టుపక్కల రైతులందరికీ పండగే అని చెప్పాలి. ఎందుకంటే రైతులంతా ఆ ప్రదేశంలో సామూహికంగా బోర్లు (Combined Borewells) వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. 

ఈ పద్దతిలో ఒక్కో బోరుకు కొంత భూమి చొప్పున యజమానికి చెల్లిస్తున్నారు రైతులు. ఐతే పక్కపక్కనే బోర్లు వేయడాన్ని చట్టం ఒప్పుకోకపోయినా,  పంటలు పండించాలంటే తప్పడం లేదని రైతులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం మడుగుపల్లి కొండ (Madugupalli Konda) ప్రాంతంలో అర ఎకరంలో 60 బోర్లు వేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అన్నీ బోర్లలో నీళ్ళు వస్తున్నాయని రైతులు చెప్పారు. గతంలో మడుగుపల్లి గ్రామంలో బోర్లు వేస్తేనే నీళ్లు దొరికేవని.. క్రమంగా నీళ్లు అడుగంటడంతో ఊరి చివర బోర్లు వేయడం ప్రారంభించామని రైతులు తెలిపారు. కాలానుగునంగా ఆ బోర్లు కూడా ఎండిపోవడంతో ఇలా సామూహిక బోర్లు (Mass Bores) వేసుకుంటున్నామని చెప్పారు. ఇలా అర ఎకరంలో 60 బోర్లు వేయడం సర్వత్రా ఆసక్తిరేపుతోంది.