
మూవీ రిపోర్ట్- వర్షిణి (Varshini).. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా, పలు టీవీ షోలకు యాంకర్ గా బాగా ఫేమస్ అయ్యింది వర్షిణి. మరీ ముఖ్యంగా ఢీ డ్యాన్స్ షో (Dhee Dance Show) తో పాటు పలు కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. అసలు విషయానికి వస్తే.. వర్షిణి, హైపర్ (Hyper Aadi) ఆది ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
హైపర్ ఆదితో కలిసి డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసింది వర్షిణి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో నిజంగానే రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే గతంలో ఓ ఇంటర్వ్యూలో అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది వర్షిణి. మళ్లీ ఈ మధ్య మరోసారి వర్షిణి, హైపర్ ఆదిలు పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆదితో పెళ్లిపై స్పందించిన వర్షిణి, జస్ట్ సీరియస్ గా ఉన్న ఎమోజీలు పోస్ట్ చేసింది.
ఇన్ స్టా చాట్ డిస్కషన్ లో ఓ నెటిజన్ వరిషిణితో.. పెళ్లి చేసుకుందామని అని అడిగాడు. దీనిపై సరదాగా రియాక్ట్ అయిన వర్షిణి.. మా అమ్మతో మాట్లాడమని సలహా ఇచ్చింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో వర్షిణి పెళ్లిపై తెగ రూమర్స్ వస్తున్నాయి. మరి వర్షిణి పెళ్లిపీఠలెప్పుడు ఎక్కుతుందోనని ఆమె అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.