Newspillar
Newspillar
Tuesday, 15 Aug 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - టెట్ (TET)కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆగష్టు 15 మంగళవారం వరకు మొత్తం రెండ లక్షల 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. టెట్ పరీక్ష దరఖాస్తు కోసం ఈనెల 16 తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం వరకు మొత్తం 2,50,963 దరఖాస్తులు రాగా, వీటిలో పేపర్‌-1కు 74,026 మంది,  పేపర్‌-2 కు 16,006 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

ఇక ఈ రెండు పేపర్లూ రాసేందుకు 1,60,931 మంది అప్లై చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆగస్టు 2 నుంచి టెట్‌ (TET) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక ఈనెల 16 అంటే బుధవారం వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో మరో 50 వేల అప్లికేషన్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష సెప్టెంబర్‌ 15న జరగనున్న సంగతి తెలిసిందే.