Newspillar
Newspillar
Wednesday, 16 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్ రిపోర్ట్- ఈ మధ్య కాలంలో ప్రేమలు, ప్రేమ పెళ్లిళ్లు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సినిమా కధలకు మించిపోయి ఉంటున్నాయి. ఇదిగో హైదరాబాద్ (Hyderabad) లో ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు, తన భర్తకు మరో యువతితో పెళ్లి కూడా చేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌ (Banjarahills)  జరిగింది. బంజారాహిల్స్‌లోని సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ 20 ఏళ్ల యువతి హోం ట్యూటర్‌ గా పనిచేస్తుంది. 2020లో యూసుఫ్‌ గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ 23 ఏళ్ల గాంధీ (Gandhi) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.  అధి కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు. ఇరువర్గాల కుటుంబ పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం చేయడంతో ఎంచక్కా సహజీవనం చేస్తున్నారు. ఐతే గాంధీకి రోజా (Roja) అనే మరో యువతితో సంబంధం ఉందని యువతి అనుమానిస్తూవస్తోంది.

ఇంకేముంది ఈ విషయంపైనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు పడి పోలీసులు వరకు వెళ్లింది వ్యవహారం. తామిద్దరం మంచి స్నేహితులమని గాంధీ, రోజాలు అందరిని నమ్మించడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. దీంతో మే 14న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకొని వాళ్లిద్దరు వివాహం జరిపించింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ప్రశ్నిస్తే భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. ఆరా తీస్తే తనను పెళ్లి చేసుకునే కంటే ముందే గాంధీ, రోజా ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసిందా ఆయువతికి. ఇంక చేసేది లేక తనకు న్యాయం చేయాలని యువతి మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఆశ్రయించగా, పోలీసులు గాంధీ, రోజాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు ముందే పెళ్లి చేసుకున్న గాంధీకి మరో యువతితో పెళ్లి ఎందుకు జరిపించిందని రోజాను ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడం లేదు.