Newspillar
Newspillar
Thursday, 24 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

ఖమ్మం రిపోర్ట్- మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) తన రాజకీయ భవితవ్యంపై కీలకప్రకటన చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ 115మంది అభ్యర్ధుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తూవస్తున్నారు. అంతే కాదు తుమ్మల అనుచరులు భగ్గుమన్నారు. పార్టీ మారాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలేరు (Paleru) నుంచి తుమ్మలను పోటీ చేయించాలని ఆయనఅనుచరులు పట్టుదలతో ఉన్నారు. రెండు మూడు రోజుల తర్జనభర్జన తరువాత ఇక బీఆర్ఎస్ ను పక్కనపెట్టి పోటీలోకి దిగాలని తుమ్మల నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం ఉదయం హైదరబాదా నుంచి బయలుదేరి ఖమ్మం జిల్లాసరిహద్దు నాయకన్ గూడెం వద్ద చేరుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు.

జిల్లా సరిహద్దు నుంచి సుమారు వెయ్యి కార్లు, రెండు వేల బైక్‌ లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీతో ఖమ్మం (Khammam) చేరుకున్న ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వర రావు తన రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేశారు. జిల్లా అభివృద్ధి కోసం తనజీవితం అంకితం చేశానన్న తుమ్మల.. ఈ ఎన్నికలు తనకు పెద్దగా అవసరం లేదని చెప్పారు. రాజకీయ పదవి కోసం కాదని.. జిల్లా ప్రజల కోసమే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదన్న తుమ్మల.. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలిచి వస్తాననిచెప్పారు. దీంతో ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు. త్వరలోనే తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.