
క్రైం రిపోర్ట్- హైదరాబాద్ లో రేవ్ పార్టీ (Rave Party) కలకలం రేపుతోంది. సాధారణంగా రేవ్ పార్టీలు సిటీకి కాస్త దూరంలో, ఫామ్ హౌజ్ లలో నిర్వహిస్తుంటారు. కానీ ఈ సారి ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డునే రేవ్ పార్టీ చేసుకున్నారు కొందరు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. మాదాపూర్ (Madhapur) లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడి చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఓ సినీ నిర్మాతతో సహా ఐదుగురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో పలువురు సెలబ్రెటీలు సహా యువతులు మొత్తం 20 మందికి పైగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.