Newspillar
Newspillar
Sunday, 03 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

వెధర్ రిపోర్ట్- తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉండగా, విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో, ఆదినారం ఉదయం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. శనివారం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో 5.5 సెం.మీ., నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం బీరవెళ్లి 5.4 సెం.మీ., నారాయణపేట జిల్లా ధన్వాడ 4.8 సెం.మీ., నిర్మల్‌ జిల్లా భైంస మండలం వనాల్‌ పహాడ్‌లో 4.3 సెం.మీ. వర్షం కురిసింది.