Newspillar
Newspillar
Thursday, 07 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ క్రైం రిపోర్ట్- (International Crime) మహిళలను అతి కిరాకతకంగా హత్య చేసిన దుర్మార్గుడి చర్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కొంత మంది వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని అతి దారుణంగా హత్య చేసి, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటున్నాడో కిరాతకుడు. ఆ తరువాత వారి మృతదేహాలను కిచెన్‌ లో గొయ్యి తీసి పాతిపెడుతూ వస్తున్నాడు. ఇలా వరుసగా నేరాలకు పాల్పడుతున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ ను రువాండా (Rwanda) రాజధాని కిగాలీ (Kigali) పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 34 ఏళ్ల నిందితుడి నివాసంలో జరిపిన తవ్వకాల్లో మొత్తం 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు కిగాలి పోలీసులు చెప్పారు. అయితే ఆ దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. నిందితుడు కొన్ని మృతదేహాలను యాసిడ్‌ పోసి మరీ కరిగించి, ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొరికిన మృతదేహాలు ఎవరివని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.