Newspillar
Newspillar
Friday, 08 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- సాధారణంగా మన బ్యాంకు అకౌంట్ నుంచి హఠాత్తుగా డబ్బులు కట్ కావడం చూస్తుంటాం. కానీ హరియాణాకు (Hariyana) చెందిన ఓ రైతుకు మాత్రం ఇందుకు విరుద్దంగా జరిగింది. అతడి బ్యాంకు ఖాతాలో ఏకంగా 200 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్‌ (Vikram) ఓ సాధారణమ రైతు. గురువారం విక్రమ్‌ తన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు చూసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లాడు. అతడి ఖాతాలో 200 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు అధికారులు చెప్పడంతో అతడికి ఏం అర్ధం కాలేదు. ఒకింత అనుమానం కలిగి గ్రామస్థులతో కలిసి వెళ్లి పోలీసులను ఆశ్రయించిన విక్రమ్‌ తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. బ్యాంకు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటామని పోలీసులు చెప్పారు. ఒక్కోసారి సాఫ్ట్ వేర్ పొరపాట్లతో ఇలాంటివి జరుగుతుంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు.