
రాజమహేంద్రవరం రిపోర్ట్- ఏపీ స్కిల్ డెంవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీ నమోదుచేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu) విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 2.45 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన వాదనల తరువాత చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యామూర్తి హిమబిందు (Himabindu) ఉత్తర్వులు జారీచేశారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాయంత్రం 6.45 గంటల సమయంలో న్యాయామూర్తి ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పోలీసులు రోడ్డు మార్గంలో చంద్రబాబును అర్ధరాత్రి 1.16 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే దారిపొడవునా టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఆయన కోసం ఎదురుచూశారు.