Newspillar
Newspillar
Saturday, 16 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

న్యూస్ పిల్లర్ రిపోర్ట్- టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రాజకీయ దురుద్దేశ్యం, కక్ష్య సాధింపులో భాగంగానే జైలుకు పంపారని నారా బ్రాహ్మణి (Nara Bramhani) ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) పాటు బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ కొవ్వోత్తుల ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని జగన్ సర్కార్ పై మండిపడ్డారు బ్రాహ్మణి. చంద్రబాబు, లోకేశ్‌ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) నిర్వహించిన కొవ్వోత్తుల ర్యాలీలో మాట్లాడిన బ్రాహ్మణి.. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదు.. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు.. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నాయకుడిని జైల్లో పెట్టారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా? లక్షలాది మంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా చంద్రబాబు కృషి చేశారని చెప్పారు. 

అభివృద్ధి, సంక్షేమం చేయడం నేరమా? ఉద్యోగాలు కల్పించడం నేరమా అని బ్రాహ్మణి ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రభుత్వం గంజాయి, లిక్కర్‌ ఇచ్చి యువత  జీవితాలను నాశనం చేస్తోంది..చంద్రబాబు అరెస్టును దేశమంతా ఖండిస్తోంది..  ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు.. జాతీయ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే కష్టపడేవారు.  చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ప్రజలకు నా ధన్యవాదాలు.. న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది.. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉంది.. అని నారా బ్రాహ్మణి అన్నారు.