Newspillar
Newspillar
Monday, 25 Sep 2023 18:30 pm
Newspillar

Newspillar

సినిమా రిపోర్ట్- నిత్యా మీనన్ (Nithya Menen).. తెలుగు, మలయాళ, తమిళ సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల సెలక్షన్ అంశంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా, తనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఒప్పుకుంటుంది నిత్య. ప్రస్తుతం కుమారి శ్రీమతి (Kumari Srimathi) వెబ్‌ సిరీస్‌ లో నటిస్తోంది నిత్యా మీనన్. ఇటువంటి టైంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్‌ సమయంలో ఒక తమిళ హీరో తనను బాగా వేధిస్తున్నాడని.. అతని వల్ల తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నిత్యా మీనన్ చెప్పినట్లు ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

దీంతో అభిమానులంతా నిత్యను వేధిస్తున్న తమిళ హీరో ఎవరబ్బా అంటూ సెర్చ్ చేస్తున్నారు. ఈ విషయంపై నిత్యామేనన్‌ ను మీడియా సంప్రదించగా, ఈ వార్తను ఆమె ఖండించారు. తాను తమిళ హీరో వేధిస్తున్నాడని ఎక్కడా చెప్పలేదని, అసలా పుకారు ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని చెప్పారు నిత్య.  ప్రస్తుతం గోమఠేష్‌ ఉపాధ్యాయ డైరెక్షన్ లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌ టైనింగ్‌ వెబ్‌ సిరీస్‌ కుమారి శ్రీమతి స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంది. ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇక నిత్యా మీనన్ ‘కోలాంబి’ (Kolambi Movie) అనే మలయాళ మూవీతో పాటు, ధనుష్‌ 50వ సినిమాలోను నటిస్తున్నారు.