Newspillar
Newspillar
Wednesday, 27 Sep 2023 00:00 am
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేశారు టెట్‌ కన్వీనర్‌ రాధా రెడ్డి. టెట్‌ ఫలితాలను https://tstet.cgg.gov.in లో చెక్‌ చేసుకోవచ్చు. టెట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 15న జరగగా , పేపర్‌-1 పరీక్షను 2.26 లక్షల మంది రాశారు. పేపర్‌-2 పరీక్షను 1.90 లక్షల మంది అభ్యర్థులు రాశారు. టెట్‌ పేపర్ -1 లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది. టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. TS TET 2023 Results