
మూవీ రిపోర్ట్- ప్రముఖ యాంకర్ సుమ (Suma), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతడి మొదటి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సంద్బంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు రాజమౌళి. రోషన్ నటుడిగా తనదైన మార్క్ చూపించాలని, తల్లిదండ్రులు సుమ, రాజీవ్ కనకాల గర్వపడేలా చేయాలని రాజమౌళి ఆకాంక్షించారు.
ఈ క్రమంలో రోషన్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక రోషన్ సినిమాకు బబుల్ గమ్’ (Bubble Gum) అని పేరు ఖరారు చేశారు. పేరుకు తగినట్లుగానే సంబంధిత పోస్టర్ లో బబుల్ గమ్ నములుతూ కనిపించాడు రోషన్. అన్నట్లు ఈ సినిమాకు రవికాంత్ పేరేపు (Ravikanth Perepu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రోషన్ సరసన చెరుకూరి మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు సైతం ఇదే మొదటి సినిమా. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 10న బబుల్ గమ్ మూవీ గ్లింప్స్ ను విడుదల చేయనన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గత సంవత్సరం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.