Newspillar
Newspillar
Saturday, 07 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) అభిమానుల ప్రవర్తనతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఫ్యాన్స్ తీరుతో తాను ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. దీంతో ఇకపై అభిమాన సంఘాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జగపతి బాబు తెలిపారు. అభిమానుల వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నది మాత్రం జగపతి బాబు చెప్పలేదు. సుమారు 33 సంవత్సరాల తన సినీ కెరీర్‌లో అభిమానులు తన ఎదుగుదలకు ముఖ్య కారణం అని భావించానని ఆయన చెప్పారు. అబిమానుల కష్టాలను తన కష్టాలుగా భావించి అన్నివిధాలుగా వారికి అండగా నిలిచానని అన్నారు. అభిమానులంటే ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మానని చెప్పిన జగపతి బాబు, బాధాకరమైన విషయం ఏంటంటే.. కొంత మంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైందని వాపోయారు.

చివరికి అబిమానులు తనను ఇబ్బందిపెట్టే పరిస్థితికి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. తన మనసు అంగీకరించకపోయినా బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఇకపై నా అభిమాన సంఘాలు, ట్రస్ట్‌ లకు నాకూ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన అభిమానుల ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నానని ప్రకటించారు జగపతి బాబు. ఐతే తనను ప్రేమించే ప్యాన్స్ కు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఇంతకీ అభిమానుల ద్వార జగపతి బాబు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారబ్బా అని సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అన్నట్లు జగపతి బాబు ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram), ప్రభాస్ సలార్‌ (Salaar) సినిమాల్లో నటిస్తున్నారు.