Newspillar
Newspillar
Sunday, 15 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

క్రైం రిపోర్ట్- హైదరాబాద్ (Hyderabad) రోడ్లపై కొంత మంది యువతీయువకుల విచ్చలవిడితనం పెరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో కార్లు, బైకులలపై కొందరు ఆకతాయిలు హల్‌ చల్‌ చేస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ యువ జంట వికృత చేష్టలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శంషాబాద్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెక్ ప్లైఓవర్ పై కారుపైనే కూర్చొని ముద్దులు పెట్టుకున్నారీ యువ జంట. నడి రోడ్డుపై ఉన్నామనే విషయాన్ని కూడా మరచిపోయి కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి కౌగిలించుకొని ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఈ యువ జంటకు సంబందించిన ముద్దుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్‌ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.