Newspillar
Newspillar
Monday, 16 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) పోన్అ పోయింది. అవును అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ లో జరిగిన భారత్‌-పాక్‌ క్రికెట్ మ్యాచ్‌కు చాలా మంది సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా కూడా ఉన్నారు. టీమ్‌ ఇండియాను సపోర్టు చేస్తూ కనిపించారు ఊర్వశీ రౌతేలా. ఈ క్రమంలో స్టేడియంలో తన ఖరీదైన ఫోన్‌ ను పోగొట్టుకున్నట్లు ఆమె తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

తన ఫోన్ 24 క్యారెట్ల బంగారంతో తయారైన ఐఫోన్‌ అని, ఎవరికైనా ఆ ఫోన్ దొరికితే తనకివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతే కాదు తన ఫోన్ విషయంలో సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను కూడా ట్యాగ్‌ చేశారు ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). అన్నట్లు ఊర్వశీ రౌతేలా తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్తార్ తో కలిసి డ్యాన్స్‌ చేసిన ఊర్వశీ తాజాగా రామ్‌ స్కంద సినిమాలోనూ కల్ట్‌ మామా అంటూ ఉర్రూతలూగించారు.