Newspillar
Newspillar
Monday, 16 Oct 2023 18:30 pm
Newspillar

Newspillar

జనగామ రిపోర్ట్- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) గులాబీ కండువా కప్పి పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ మెడికల్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ (BRS) చేరారు. కాంగ్రెస్‌లో 45 ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని ఈ సందర్భంగా పొన్నాల అన్నారు. జనగామ (Janagama) నియోజకవర్గంలో కేసీఆర్‌ 7 రిజర్వాయర్లు నిర్మించారని చెప్పారు పొన్నాల. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ లో చేరానన్నారు. జనగామ జిల్లాకు మరింత ప్రోత్సాహకం ఇవ్వాలని, పాడిపరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు విజ్ఞప్తి చేశారు పొన్నాల లక్ష్మయ్య.